top of page
Search

A Very Historic New System Of Education - MLC Candidate Alphores Dr V Narender Reddy

చాలా చారిత్రాత్మకం నూతన విద్యా విధానం - సందేశం ఇచ్చిన MLC అభ్యర్థి అల్ఫోర్స్ డా, వి. నరేందర్ రెడ్డి

18 Sep 2024 కరీంనగర్ SBN న్యూస్:- విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయని ప్రత్యేకంగా నూతన విద్యావిదానంలో చాలా చక్కటి మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా అందరికి విద్య అందేటట్లుగా ప్రణాళికను రూపొందించాలని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజక వర్గ ఎంఎల్ సి అభ్యర్థి అల్ఫోర్స్ డా, వి.నరేందర్ రెడ్డి స్థానిక ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్, డిగ్రి మరియు పి.జి కళాశాలల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ సౌజన్యంతో నిర్వహించినటువంటి నూతన విద్యా విదానం సెమినార్ కు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సమాజంలో అన్ని రంగాలలో చాలా మార్పులు వస్తున్నాయని ప్రత్యేకంగా విద్యా రంగంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవడమే కాకుండా వాటిని అమలుపర్చి అత్యుత్తమంగా ఉద్యోగంలో కొనసాగి ఆదర్శంగా నిలువాలని సూచించారు. ప్రతి ఒక్కరు మార్గదర్శకాలను పాటించి విద్యార్థులకు చాలా చక్కగా భోదించి బావిపౌరులుగా తీర్చిదిద్ద వల్సిన అవసరం ఎంతగానో ఉందని గుర్తు చేశారు. మరియు నిపుణుల ద్వారా రూపొందించబడిన నూతన విద్యావిదానం భారత దేశ విద్యా వ్యవస్తకు ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు.


రాబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేస్తున్న తనకు పట్టభద్రులందరు ఐక్యంగా ఉండి మద్దతు ఇవ్వాలని కోరారు. అద్యాపకులకు ఎదురవుతున్న పలు సమస్యలకు పరిష్కారం చేస్తానని హామి ఇచ్చారు. ముఖ్యంగా ఆరోగ్య భీమా, ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించడం మరియు అన్ని రకాలుగా అధ్యాపకులు వృత్తి అభివృద్ధికై తోడుంటానని, మీ సమస్యల పరిష్కారం కొరకు ఎల్లప్పుడు గళం విప్పుతానని చెప్పారు. అద్యాపకుల వృత్తికి వన్నె తెస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ని పలు కళాశాలల యాజమాన్యాలు మరియు అధ్యాపకులు ఘనంగా సత్కరించి రాబోయె యం.యల్.సి ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో టి.పి.జెన్.ఎ జిల్లా ప్రతినిధులు ప్రభాకర్ గౌడ్, వెంట్, అధ్యాపకులు సంఘం ప్రతినిధులు మాసం రత్నాకర్ రెడ్డి, రాజేశ్వర్, టి.పి.డి.యం.ఎ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, సతీష్ కుమార్ మరియు పలువురు కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

 
 
 

Comments


bottom of page