top of page
Search

Adhikarika Hodalo Tolisari Maro Mettu Adhigaminchina Nerella Sharada*

*పెద్దపల్లి జిల్లాలో నేడు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన నేరెళ్ల శారద*

*కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగి అరుదైన గౌరవం పొందిన నేరెళ్ల శారద*

*అధికారిక హోదాలో తొలిసారి మరో మెట్టు అధిగమించిన నేరేళ్ళ శారద*

(కరీంనగర్ SBN )

ఒక చిన్నగ్రామం.. బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ నేపథ్యం.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని, రాజకీయ కుటుంబం అండదండలు కూడా లేని నెరెళ్ళ శారద వివాదరహిత మహిళగా, మహిళా నాయకురాలిగా పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందిస్తూ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్న శారద. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకునే వారికి స్పూర్తిగా నిలుస్తున్నారు. ఆమె మరెవరో కాదు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారద, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుపరిచితమైన శారద గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అధికారిక లాంచనాలతో స్వాగతం పొంది, జరగిన అధికారిక కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు, ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుని మరో మెట్టును అధిగమించి అందరి దృష్టిని ఆకర్షించారు. చట్టసభల్లో ప్రజా ప్రతినిధి కాకపోయినా కూడా శారదకు ఈ అవకాశం దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అధికారిక లాంఛనాలతో అధికారుల ద్వారా స్వాగతం పొంది, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన మొదటి మహిళా నాయకురాలు గా నేరెళ్ళ శారద చరిత్ర సృష్టించారు.

పతాకావిష్కరణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారుల్లోనూ ఆసక్తి నెలకొన్నది, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ బాధ్యతల ఖరారు వ్యవహారం చివరి వరకూ ఉత్కంఠను పెంచింది. చివరకు మంగళవారం సాయంత్రం 32 జిల్లాలకు అధికారికంగా జాతీయ పతాకవిష్కరణ జరిపే నేతల జాబితాను ప్రకటించారు. కరీంనగర్, జగత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలకు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు అడ్డూరి లక్ష్మన్ కుమార్, ఆది శ్రీనివాస్ కే అవకాశం కల్పించగా, ఒక్క పెద్దపల్లి జిల్లాకు మాత్రం మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవలే నియామకమైన నేరేళ్ళ శారదకు ఆ బాధ్యత లు అప్పగించడం విశేషం.

జిల్లాల విభజనకు ముందు ఆయా జిల్లాల మంత్రులే స్వాతంత్ర్య దినోత్సవం రోజున అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేసేవారు. జిల్లాల విభజనతో పెరిగిన సంఖ్యకు అనుగుణంగా మంత్రులు లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నయంగా ఇతర ప్రజా ప్రతినిధులకు ఆ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రులు, ప్రభుత్వ విప్ లు అధికంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో జాతీయ పతకాలను ఎగురవేస్తూ వచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ సీనియర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారని.. కరీంనగర్లో మరో మంత్రి పాన్యం ప్రభాకర్ ఎగురవేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే సిద్ధిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మంత్రిగా కొనసాగు తుండటంతో అక్కడ జాతీయ పతాకావిష్కరణ బాధ్యతలు పొన్నంకు తప్పలేదు. ఆ జిల్లా నుంచి మరెవరి కైనా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కినా అక్కడ మరొకరికి అప్పగించి మంత్రి పొన్నంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించే వారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైనందున ఇక్కడ మరొకరికి అవకాశం ఇవ్వడానికి బదులు ప్రభుత్వం సీనియర్ మంత్రి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో పెద్దపల్లి జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి నేరేళ్ల శారదను పెద్దపల్లి జిల్లాకు ఎంపిక చేశారు.

*పార్టీకి విధేయురాలిగా సేవలు చేసి పొందిన గౌరవం *

పార్టీ పట్ల అంకితభావం, అధినాయకత్వం పట్ల విధేయత నేరేళ్ళ శారద రాజకీయ ప్రస్తానంలో కీలక పాత్ర పోషించాయి. ఎమ్మెల్సీ పదవి చేతికందే సమయంలో రెండుమార్లు చేజారినా, చట్టసభలకు పోటీ చేసే అవకాశం చివరి నిముషంలో దక్కకపోయినా కూడా నిరాశ చెందకుండా పార్టీ నాయకత్వం అప్పగిం చిన బాధ్యతలను నెరవేరుస్తూ వచ్చారు, అంగబలం, అర్థబలం లేకపోయినా పార్టీ నాయకత్వం పట్ల ఎనలేని విధేయతను కనబరుస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పలు పదవులు ఆమెను వరిస్తూ వచ్చాయంటే అతిశ యోక్తి కాదు, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన నేరేళ్ళ శారద రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలం దిస్తూ వస్తున్నారు. గతంలోనూ పలు పదవులు చేపట్టి న శారద తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో మరోమారు కీలక పదవిని దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయం లో నేరేళ్ళ శారద పలు పదవులు చేపట్టారు. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ కరీంనగర్ రీజియన్ అధ్యక్షురాలిగా, పట్టు పరిశ్రమ బోర్డు జాతీయ కమీషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఏపీ స్టేట్ ఎథిక్స్ కమిటీ సభ్యురాలిగా، జిల్లా మహిళా సాధికార త సమాఖ్య అధ్యక్షురాలిగా، జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ సభ్యురాలిగా، రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా، కేంద్ర సిల్క్ బోర్డు డైరెక్టర్، నెహ్ర యువకేంద్ర మెంబర్، ఖాదీ బోర్డు డైరెక్టర్ పదవులను మెట్పల్లి ఖాదీ డైరెక్టర్ పదవులను చేపట్టారు. పార్టీలోనూ పలు పదవులు చేపట్టారు. వివాద రహితురాలిగా పేరొందారు, కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పార్టీకి సేవకురాలిగా కొనసాగుతూ వచ్చారు. రామడుగు మండల జడ్పీటిసి గా రాజకీయ అరంగేట్రం చేసిన నేరేళ్ళ శారద మహిళ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు చేపట్టారు. పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహిత అనుచరురాలిగా కూడా గుర్తింపు పొందారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన శారద పీసీసీ అధికార ప్రతినిధి హెూదాలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి శారద అందించిన సేవలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించారు.

 
 
 

Comments


bottom of page