Avineethi Parula Bharatham Padatham - Velichala Rajender Rao
- sbnnews24tv7
- Jul 7, 2024
- 2 min read
*అవినీతిపరుల భరతం పడతాం - కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు*

06 జులై శనివారం 2023 - ఈ రోజు కరీంనగర్ ప్రెస్ భవన్ లో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న వెలిచాల రాజేంద్ర రావు,
మీడియాను సంబోధిస్తూ, సందర్భం ఏమిటి అంటే రిఫ్రామ్ కరీంనగర్ కార్పొరేషన్, క్లిన్ ఆఫ్ కార్పొరేషన్ పోగ్రాం ప్రారంభిద్దామని కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించుకున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ లో అత్యంత దుర్మార్గమైన అవినీతి జరుగుతున్నది. రిఫ్రాం కార్పొరేషన్, క్లీన్ ఆఫ్ కార్పొరేషన్ ద్వారా అవినీతిని కడిగి వేయడం మా ధర్మం కాంగ్రెస్ పార్టీ ద్యేయం.
మా తండ్రి జగపతిరావుకు ఒక మంచి మిత్రుడు ప్రభాకర్ మంచి రచయిత, ఇటీవల ఆయన ఒక పుస్తకం రాశారు. అందులో మా తండ్రి జగపతి రావు, మా పెద్దనాన్న కొండల్ రావు ల పేర్లు రాశారు. జగపతి రావు, కొండల్ రావు వాళ్ళు నాకు అత్యంత మిత్రులు అని ప్రభాకర్ రావు అన్నారు. ఆయనతో ఈ రోజు ఉదయం అల్పాహారం చేశాను. ఆయన కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం అవినీతి మాయం ఐపోంది అని అన్నారు.
కరీంనగర్ ప్రజలు కోడైకొస్తున్నారు.
ఈ అవినీతికి కారణం ఏంటి అంటే ఏ సునీల్ రావు అన్నారు. ఆయన పేరు ఏ సునీల్ రావు కాదు వై. సునీల్ రావు అన్నాను.
కాదు ఏ ఏ సునీల్ రావు అన్నారు.
మంచిర్యాల చౌరస్త పోదాం బాబు జడ్జీవన్ రామ్ విగ్రహం నిలబడి పది మంది పిలిచి అడుగుదాం. అందరూ అవినీతి, అనకొండ సునీల్ రావు అంటారు అన్నారు. కరీంనగర్ చరిత్రలో కూడా ఇంత అవినీతి ఎప్పుడు జరగలేదు. గత నాలుగు రోజులుగా నేను వందల మందిని కలిశాను. ఎక్కడ చుసిన అవినీతి మాట విన్నాను.
అందుకే
పాత్రికేయ మిత్రులా ద్వారా ప్రజలకు తెలియజేసి దీని మీద ఒక్క పోరాటం చేస్తాం. ఇదే మనం చేసే రిఫార్మ్,ఇదే మనం చేసే క్లీనప్,
గుడ్ మార్నింగ్ కరీంనగర్ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు ఒక వార్డ్ కు వెళ్లి ప్రతి రోజు గడప గడపకు కాంగ్రెస్ ద్వారా వెళ్లి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది.
నాయకులు, అధికారులు ఎల పని చేస్తున్నారు ఇబ్బందులు ఏమైన ఉన్నాయా అని అడిగి అవి పరిష్కారమయ్యే విధంగా చూస్తాం.పిల్లల కు ఏమైనా ఇబ్బందులు, కుటుంబలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటాం. బస్టాండ్ లో, మున్సిపల్ కార్పొరేషన్ లో, అంబేద్కర్ స్టేడియంలో, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో, ఎల్ఎండి వాకింగ్ ఏరియాలో సర్కస్ గ్రౌండ్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసి అందులో వచ్చిన సమస్యలను ఈ రకమైన సమస్య, ఎలాంటి అవినీతి జరిగిందని ప్రతిరోజు సాయంత్రం ఫిర్యాదులు చదివి తెలుసుకుంటాం. అధికారుల పైన కానీ, నాయకుల పైన గాని అవినీతిలో భాగస్వాములు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన భూ కబ్జాలు గాని, ఏలాంటి అవినీతి జరిగింది అని ఫిర్యాదు వస్తే మా మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాo. బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేయడమే మా కాంగ్రెస్ పార్టీ ధర్మం, ద్యేయం.
Comments