top of page
Search

Awareness About Seat Belts - Siddipet Traffic ACP Suman Kumar

*రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాజీవ్ రహదారి పొన్నాల చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పట్ల అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్*

సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయుచున్న వారికి గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించుకొని వాహనాలు డ్రైవ్ చేయాలని సూచించారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బెలూన్స్ ఓపెన్ కావు అప్పుడు తీవ్ర గాయాలు లేదా చనిపోయే అవకాశం ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. డ్రైవర్ కాకుండా పక్కన కూర్చున్న వారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. డ్రైవ్ చేసేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడవద్దని తెలిపారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దని, అధిక వేగంగా వాహనాలు నడపవద్దని మితిమీరన వేగం చాలా ప్రమాదమని తెలిపారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకు వెళ్లేటప్పుడు మీరు అనుకున్న సమయం కంటే అరగంట ముందు బయలుదేరి క్షేమంగా గమ్యస్థానాల చేరుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు డిఫాల్ట్ వాహనం యొక్క డిఫాల్ట్ ద్వారా రోజు ప్రమాదాలు జరగడంలేదని కేవలం మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని ఎంత కృంగదీస్తుందో రోడ్డు ప్రమాదం జరిగిన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి, ఏఎస్ఐ సదాశివరావు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 
 
 

Comments


bottom of page