top of page
Search

Free Medical Check-Up Camp Organized By The First Aid, Home Nursing' Voluntary Service Association NGO

ప్రధమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంఘం fahnpwa NGO ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం

fahnpwa NGO ఆధ్వర్యంలో వికలాంగులకు షుగర్ మరియు బిపి పరీక్ష
fahnpwa NGO ఆధ్వర్యంలో వికలాంగులకు షుగర్ మరియు బిపి పరీక్ష

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో ప్రధమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంఘం ఎన్జీవో ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాచకొండ ఆనంద్ సహకారంతో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల శిబిరంకు విశేష స్పందన లభించింది.

గ్రామంలో దాదాపు వంద (100) మందికి పైగా డయాబెటిక్ మరియు బిపి పరీక్షలను నిర్వహించి పరీక్షలలో పాజిటివ్ వచ్చిన వారిని సంబంధిత ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సెంటర్ కు రెఫర్ చేశారు. పరీక్షలకు అనుగుణంగా సంబంధిత ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సలహాతో మందులు వాడాలని సూచించారు.డయాబెటిక్, బిపి పలు (NCD) అసంక్రమిక వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ చికిత్స వైద్యులు, ప్రథమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంఘం ( fahnpwa NGO) జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు సిరిమల్లె మల్లేశం, జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి మంద వేణుగోపాల్ గౌడ్, ల్యాబ్ టెక్నీషియన్ ఎం.మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

 
 
 
bottom of page