Gramalalo, Slums area llo RMP La Lage Andubatulo Undi Aarogya seva Andincha Galaraa...???
- sbnnews24tv7
- Jul 31, 2024
- 1 min read
Updated: Aug 12, 2024
గ్రామాలలో మారుముల గ్రామాలలో,పట్టణాల స్లమ్ వీధుల్లో సీజనల్ వ్యాధుల వల్ల తీవ్ర అస్వస్థతకు ప్రజలు గురిఅయితే తెలంగాణ రాష్ట్రం అంతటా దాడులు చేసేవారు చేయించేవారు వారి ప్రాణాలు రక్షించే సేవలు అందించగలరా...??,

ప్రజలకు అందిస్తున్న సేవలు అదేవిధంగా వీరు అందించగలరా..???
ఆర్ఎంపీ లపై రాష్ట్రవంతటా దాడులు జరుపుతూ, క్వాలిఫైడ్ డాక్టర్లు హాస్పిటల్స్ చేసే నేరాలకు వర్తించే సెక్షన్ లు ఆర్ఎంపీలపై చార్జి చేయిస్తున్నారు, దానికి సమర్థిస్తున్న వారందరి కుటుంబాలకు ఆ వ్యవస్థలకు తెలిసి రావాలంటే రాష్ట్రంలో ఆర్ఎంపీలు అందరు ఏకతాటి పై వచ్చి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి వస్తది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కీ శే ఎస్ రాజశేఖర్ రెడ్డి హయం లో కొంత అర్థం చేసుకొని శిక్షణ తరగతులు నిర్వహించడానికి నిధులు కేటాయించారు, శిక్షణ తరగతులు నిర్వహించారు, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ జారీ చేయలేకపోయారు..,బహుశా ఎంబిబిఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ సంఘం యొక్క ఒత్తిడి వల్లనే అని పరిణామాల వల్ల అర్థమవుతుంది .. ఆ తర్వాత శిక్షణ తరగతులు ఆపేసి వారు కూడా పూర్తిగా దానిని వదిలేశారు. ఆ తదుపరి వచ్చిన టి/బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఏ లాంటి శిక్షణ కొనసాగించాలి అనే ధోరణి అనుసరించలేదు, మభ్యపెడుతూ వచ్చింది,
రాష్ట్రంలో ఆర్ఎంపీ వ్యవస్థ పై టీఎంసీ పేరుతో ఏర్పడిన గ్రూప్ లు ప్రభుత్వ సంబంధిత వివిధ శాఖల సహకారం తీసుకుంటూ ప్రస్తుతం ఆర్ఎంపి క్లినిక్ల పై దాడులు జరుపుతూ, దొంగ డాక్టర్లని నకిలీ డాక్టర్లని, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పడం, పత్రికల్లో రాయించడం, అతి ఉత్సాహం కొన్ని మీడియా చూపడం, వీటన్నిటితో రాష్ట్రంలో ఆర్ఎంపి లు ఆందోళనకు గురవడం మానసికంగా బాధపడడం.. ఆ కుటుంబాలు అవమానానికి గురవడం జరుగుతుంది.., రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ మధ్యన జరుగుతున్న దాడుల వెనుక వేరే రాజకీయ పార్టీ రాజకీయ కుట్ర దాగి ఉన్నదా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి, దానికి తోడు ప్రస్తుత ప్రభుత్వం ఏ లాంటి చర్యలు చేపట్టకపోవడం, ఆ కుట్రలు ప్రస్తుత పాలక ప్రభుత్వం తెలుసుకోలేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీల దురదృష్టం.
గత్యంతరం లేని పరిస్థితిలో రాష్ట్రమంతటా ఆర్ఎంపీలు ఏకతాటిపై వచ్చి మూడు రోజులు బంద్ చేస్తే దాడులకు సమర్థించే ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది.. దాడులకు ప్రోత్సహిస్తు రాజకీయ కుట్ర చేస్తున్నవారు ఇదే జరగాలని కాచుకుని చూస్తున్నారా..??? (సయ్యద్ నిజాముద్దీన్ SBN న్యూస్ ఎడిటర్)
Comentarios