ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి - జమ్మికుంట పట్టణ సిఐ రవి
జాతీయ కరాటే పోటీలలో మెరిసిన మేలిమి బంగారం జన్ను కావ్య - అంభినందించిన జమ్మికుంట పట్టణ సిఐ రవి.
దమ్ముక కామ్ షటోరియో కరాటే ఆధ్వర్యం
ఈ నెల 15 ఆదివారం కరీంనగర్ అంబేత్కర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన జాతీయ కరాటే పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభను కనబరిచి బంగారు పతకం తెలంగాణ కరాటే అసోసియేషన్ చైర్మన్ వసంత్ కుమార్ చేతుల మీదుగా అందుకున్న సంధర్భంగా,తేది 9-09-2024 గురువారం రోజున జమ్మికుంట పట్టణ సీఐ రవి జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకం సాధించిన కావ్య మెడలో బంగారు పతకాన్ని వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పట్టణ సీఐ రవి మాట్లాడుతూ, నేటి సమాజంలో ఆడపిల్లలను బయటికి పంపించలేని తల్లిదండ్రులు ఉన్నప్పటికీ జమ్మికుంట పట్టణ పరిధిలోని మారుతి నగర్ లో నివాసముంటున్న జన్ను రమేష్ మాత్రం తన బిడ్డ కావ్యను నిర్భయంగా గత 8 నెలలుగా హుజురాబాద్ గ్లోబల్ షోటోకాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ మాస్టర్ జలీల్ వద్ద ప్రత్యేక కరాటే శిక్షణ ఇప్పించడం అభినందనీయం అని కొనియాడారు.
కావ్య జాతీయ కరాటే పోటీలలోనే కాకుండా అంతర్ జాతీయ పోటీలలో పతకాలు తెరుకువచ్చి దేశం గర్వ పడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా విద్యార్థినీ, విద్యార్థులు.యువతి యువకులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా తమ తల్లిదడ్రులు ఎంతో నమ్మకంతో స్కూల్స్, కాలేజీలకు పంపు తున్నప్పటికి కొంత మంది పిల్లలు జల్సాలు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని ఆన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన స్పోర్ట్స్, గేమ్స్, కరాటే లాంటి నేర్చుకొని, జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీలలో పాల్గొని తమ తల్లదండ్రులకే కాకుండా ప్రాంతానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. అనంతరం కరాటే మాస్టర్ జలీల్ కావ్య తండ్రి జన్ను రమేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో, అంతర్జాతీయ క్రీడా కారులు, గ్లోబల్ షోటోకాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) పాల్గొన్నారు.
Comments