Lower Manair Dam Gates Will Be Lifted at 9.00 am
- sbnnews24tv7
- Sep 15, 2024
- 1 min read
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఉదయం 9.00 గం,లకు ఎత్తనున్నారు,.16.09.2024 న,5000 క్యూసెక్కుల నీటిని మానేరు నది లోకి వదులనున్నారు.

సోమవారం తేదీ 16.09.2024 ఉదయం 9.00 గంటలకు లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి సుమారు 5000 Cusecs నీటిని మానేరు నది లోనికి వదులుటకు నిర్ణయం చేయడం జరిగింది. కావున రెవిన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా మరియు గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, పి నాగభూషణరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారిక ప్రకటన జారీ చేశారు.
నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని కోరుతున్నాము . లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్,రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాము అని పి. నాగభూషణ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డివిజన్ నెంబర్.5/IC-2, ఎల్ ఎమ్ డి కరీంనగర్ కార్యాలయం నుండి ప్రకటన జారీ చేశారు.
Comments