top of page
Search

Narcotic Jagilam Tho Jilla Kendram Lo Thanikhilu

నార్కోటిక్ జాగిలం (లియో) తో జిల్లా కేంద్రంలో తనిఖీలు

*తేదీ 10-08-2024.* *కరీంనగర్ కమిషనరేట్ లో నార్కోటిక్ సెల్ కార్యాలయం ఏర్పాటు*

*కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్*

*నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.*

కరీంనగర్ పోలీసు కమిషనరేట్ లో నిషేధిత గంజాయి మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శనివారంనాడు బస్టాండ్ లోని పార్సెల్ ఆఫీసు,కిరాణా షాపులలో, పాన్ షాప్ హాస్టల్స్ , అనుమానిత ఇండ్లలో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పోలీస్ తనిఖీలు నిర్వహించారని కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీలలో కరీంనగర్ వన్ టౌన్ సీఐ సరిలాల్ మరియు సిబ్బందితో పాటు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జగిలాం (లియో) తో డాగ్ హాండ్లర్ కానిస్టేబుల్ ఏ శంకర్ కలిసి బస్టాండ్, పలు పార్సెల్ ఆఫీసులు, కిరణా షాపుల్లో, పాన్ షాప్ మొదలగు ప్రాంతలు మరియు కొన్ని అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు.

ఎవరైనా వ్యక్తుల వద్ద , పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేక మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు తమవంతు భాద్యతగా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకి తెలియజేయాలన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు ఇక మీదట నిరంతరం కొనసాగుతాయని పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

 
 
 

Comments


bottom of page