top of page
Search

PCC State Secretary V Anjan Kumar Reacted Strongly To Mayor Sunil Rao's Criticism That "What is the Relationship Between Minister Ponnam Prabhakar and Karimnagar?"

"కరీంనగర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఏం సంబంధం" అని మేయర్ సునీల్ రావు విమర్శించడం పట్ల, తీవ్రంగా స్పందించిన, పిసిసి స్టేట్ సెక్రటరీ వి అంజన్ కుమార్

కరీంనగర్ ప్రథమ పౌరుడు అని పిలువబడే మేయర్ మీకు ఆ మాత్రం అవగాహన లేని ప్రథమ పౌరుడా అబద్ధపు మాటలు మానుకోమనీ పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ హెచ్చరిక

మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ కు ఏం సంబంధం అని మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము - పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మీడియా ముందు మాట్లాడిన కుమార్, జిల్లాకు మంత్రి కాదండి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి పొన్నం ప్రభాకర్ మంత్రి గా ప్రమాణస్వీకారం చేసినారు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సమీక్షా సమావేశాలు తీసుకునే అర్హత ఉన్నది మీకు తెలియకపోతే తెలుసుకోండి ముఖ్యంగా ఇక్కడ పుట్టి పెరిగిన పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన కూడా ప్రజాసేవపై ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక ఆలోచనతో కరీంనగర్ జిల్లా పౌరుడిగా వారు నగర పాలక సంస్థలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై మీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఫిర్యాదుల మేరకే గతంలో మీ కార్పొరేటర్లు మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేసింది మీ బిఆర్ఎస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు. అనేక ఆరోపణలు వచ్చినాయి వాటిపై కూడా ఫిర్యాదులు మీ పార్టీ నాయకులే చేసినారు, నిన్నటి స సమీక్ష సమావేశంలో మంత్రి అధికారులతో మాట్లాడింది ఏమిటో ముందు కరెక్ట్ గా తెలుసుకోండి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు జరగవు ప్రజలకు సేవ చేయాలే ప్రజలకు అభివృద్ధి చేయాలి అనే విధంగా సమీక్షా సమావేశం జరిగింది, మీకు తెలుసో తెలువదు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ రావడానికి ముఖ్య కారణం ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెస్సార్ అప్పుడు మార్కఫీడ్ చైర్మన్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఆనాడు జరిగిన అభివృద్ధిని చూసి మీ హయాంలో స్మార్ట్ సిటీ రావడం జరిగింది. ఇది వాస్తవం ఆనాడు గనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏ కరీంనగర్లో లేకపోతే స్మార్ట్ సిటీ అనేది అర్హత రాకపోవూ మరి అభివృద్ధి ఆనాటి నుంచి ఈనాడు వరకు పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి కనులకు కట్టినట్టు కరీంనగర్లో కనిపిస్తుంది మాతా శిశు హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ పాస్పోర్ట్ ఆఫీస్ ఎఫ్ఎం రేడియో జిఎన్ఎమ్ బస్సులు తిరుపతి రైలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పున్నం ప్రభాకర్ అన్న పై అవాక్కు చివాకులు కాదు మేయర్ సునీల్ రావు, గతం మర్చిపోయి మాట్లాడుతుండ్రు, రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు మీ పాత్ర మీరు చేసిన విధానం ఏంటిదో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు అవన్నీ మర్చిపోయి మీరు మాట్లాడుతుండ్రు ఇది సరియైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా

పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ నగర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ఎస్ఏ మోసిన్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజహుస్సేన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హైమత్ సోయల్ అర్షద్ అలీ అజీజ్ హరీష్ సతీష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 
 
 

Comments


bottom of page