Pedda Banda Raayi Pai Paasham Buvva Posi Andaru Nakuthaaru.. Ekkda.. Enduku.. Telusaa
- sbnnews24tv7
- Jun 24, 2024
- 1 min read
పెద్ద బండ రాయి పై "పాశం బువ్వ" పోసి అందరూ నాకడం చేస్తారు.. ఎక్కడ.. ఎందుకు..

ములుగు జిల్లా, ములుగు మండలం కొత్తూరు గ్రామం సమీపంలోని దేవుని గుట్టపై దేవాలయం వద్ద వరద పాశం అనే కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసి నిర్వహించారు. ప్రతి సంవత్సరం తొలకరి సమయంలో గ్రామస్తులంతా కలిసి అడవి మార్గాన దేవుని గుట్ట ఆలయం పైకి వెళ్లి బియ్యం, బెల్లం, పాలు, కుడుకలతో కలిపి పాశం బువ్వ తయారుచేసి లక్ష్మీ నరసింహ స్వామికి కి నైవేద్యం సమర్పించిన అనంతరం దేవాలయం ముందు ఉన్న పెద్ద బండరాయిపై పాశం బువ్వను పోసి గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, పిల్లలు అందరూ కలిసి నాకుతారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఆచారం తమ పూర్వీకుల కాలం నాటి నుండి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. దేవుని గుట్టపై 100 ఏళ్ల నాటి పురాతన ఆలయ కట్టడం ఉంటుంది.
Komen