*People Came On The Roads To Continue RMP, PMP*
- sbnnews24tv7
- Sep 2, 2024
- 3 min read
*ఆర్.ఎం.పి, పిఎంపీ లను, కొనసాగించాలని రోడ్ల పైకి వచ్చిన ప్రజలు*

*టిఎంసి ఆర్ఎంపి వైద్యులపై పెడుతున్న కేసులకు నిరసనగా పెద్దపెల్లి జిల్లాలో వైద్యం బంద్ చేసిన ఆర్ఎంపిలు,*
*ఆదుకోవాలని మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి వేడుకుంటున్న ఆర్ఎంపి సంఘాలు*

ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రాంతాలలో, వైద్య సేవలు లేని, వైద్య సేవలు అందించ వ్యక్తులు లేని చోట, 24 గంటలు, అందుబాటులో ఉండి అతి తక్కువ ఖర్చులో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ఆర్ఎంపీలు, పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో, గ్రామాలలో వైద్యం అందని చోట RMP, PMP లము అతి తక్కువ ఖర్చులో ప్రధమ చికిత్స చేస్తున్నటువంటి మమ్ములను (TSMC) మరియు IMA వైద్యులు మా పై కక్ష కట్టి ప్రథమ చికిత్స చేయకుండా మా పై కేసులు పెట్టుతూ భయ భ్రాంతులకు గురి చేస్తున్న దాని గురించి పట్టించుకోమని విన్నవించుకుంటున్నాము అని వినతి పత్రంలో పేర్కొన్నారు.
1. పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్ యం పి, పి యం పి లపై జరుగుతున్న టిఎస్ ఎంసి, ఐఎంఏ దాడులను వెంటనే నిలిపి వేయాలి అని ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు మంత్రులకు వినతి పత్రంలో పేర్కొన్నారు.
2. 2008 లో ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన జీవో.. 428,429 లు, మరియు ప్రాథమిక చికిత్స అందించే విధంగా వసూలు బాట కల్పించే జీవనం రూపొందించి, అమలు చేయాలి ఈ జివో ప్రకారం శిక్షణ పొందిన ఆర్ ఎంపీ, పి యం పి లకు సర్టిఫికెట్ అందచేయాలి అని కోరుతున్నారు.
3. ఆర్.ఎం.పి. పి,ఎం.పి లపై ఇప్పటి వరకు టిఎంసి వాళ్ళు పెట్టిన కేసులు బేషరుతుగా ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలి అనేది ప్రభుత్వానికి వారి డిమాండ్
4. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 50 సంవత్సరాల పై బడి, పేదలకు ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల హృదయాల్లో స్థానం పొంది ఆదరించబడుతున్న వారికి అర్హతలు కల్పించి కొనసాగించాలి అని కోరుతున్నారు.
5. గత 50 సంవత్సరములనుండి ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి ఎయిడ్స్, కుటుంబ నియంత్రణ, పల్స్ పోలియో, క్షయ వ్యాది, నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజా అవగాహన కార్యక్రమాల్లో ఆర్ఎంపీపీ ఎంపీల సహకారాలు అధికారులు తీసుకోవడం జరిగింది, మరియు కరోనా కష్ట కాలంలో గ్రామీణ వైద్యులు చేసిన సేవలు మరవ లేనివి అని వారి వినతిపత్రంలో పేర్కొన్నారు.
6. ప్రపంచ ఆరోగ్య (WHO) సంస్థ ప్రజలకు వైద్య సేవలు అందలంటే వైద్య వాలంటరీ వ్యవస్థల సేవలు తీసుకోవలసిన అవసరము ఉన్నదని గుర్తించడము జరిగినది, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ సేవలు లేని చోట, ఎంబిబిఎస్ లు 24 గంటలు మారుమూల ప్రాంతాల్లో రాత్రింపగళ్లు, వైద్య సేవలు అందించలేని ప్రదేశాల్లో, స్వాతంత్రం కంటే ముందు నుండి ఆర్.ఎం.పి. పి.ఎం.పి వ్యవస్థలు అందిస్తున్న సేవలు అనేది గుర్తించాలని కోరుతున్నారు. ఇప్పటికీ కూడా మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల వరకు తప్ప, మండల కేంద్రంలో కానీ గ్రామాలలో కానీ,వైద్య సేవలు అందించే ఎంబిబిఎస్ డాక్టర్లు కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కాని లేవు అనేది జగత్ సత్యం అని ప్రభుత్వం గుర్తించాలి.
7. కాంగ్రేస్ పార్టీ 2023 ఎన్నికలలో వచ్చే ముందు 2వ సారి మెనెపెస్ట్లో ప్రకారం ఈ వృత్తిని కాపాడుతామని శిక్షణ కొనసాగించి అర్హతలు కల్పిస్తామని ఆర్ ఎంపీ, పియంపి ల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఈ మెనిపెస్టోను అమలు చేయాలి అని ఆర్.ఎం.పి సంఘాలు కోరుతున్నాయి.
8. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు చేస్తున్న దాడుల వలన గ్రామీణ వైద్యులు చాల భయబ్రాంతులకు గురి అవుతున్నారు. దీని వలన గ్రామీణ మరియు పేద ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుంది, ప్రజల ఆరోగ్యం పట్ల స్పందించే నాధులు ఉండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9. ఆర్ ఎంపీ, పి ఎంపీ లను దోంగల వలే దేశద్రోహుల వలే మిడియా ముందు మమ్ములను అవమానపరుస్తూ లేని పోని అభాండాలు అపాదిస్తూ ఆరోపణలు మా మీద రుద్దుతూ కేసులు పెట్టిస్తున్నారు, మా కుటుంబాలను రోడ్డుపాలు పడకుండా బతుకు భరోసా కల్పించాలని తమరిని కోరుచున్నాము అని ఆవేదన వ్యక్త పరచడం జరిగింది.
10. పై విషయాలను పెద్ద మనసుతో తక్షణమే నిర్ణయము తీసుకొని ఆర్ఎంపి పి.ఎం.పి ల కుటుంబాలు వీదిపాలు కాకుండా చూడలని వేడుకుంటున్నాము. గత్యంతరం లేని పరిస్థితిలో మేము అందరము పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో గ్రామాలలో వైద్య సేవలు నిలిపి వేసి మా ఉనికిని కాపాడుకోవడం కోసం నిరసన కార్యక్రమాలు ప్రజా మద్దతు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తమరికి విన్నవించుకుంటున్నాము అని ప్రజా ప్రతినిధులకు కలిసి వినతి పత్రాలు అందించారు.
మండల కేంద్రంలో పీహెచ్సీ లు, పట్టణాల్లో బస్తి దవాఖానలు, ప్రభుత్వ ఆరోగ్య సెంటర్లలో మధ్యాహ్నం 12 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి, డాక్టర్లు తప్పనిసరి ఉంటారని గ్యారంటీ ఎలాంటిది లేదు, ఇది ప్రతి మండలంలో ప్రజలందరికీ తెలుసు, గ్రామాలలో, పట్టణాల స్లమ్ ఏరియాలలో ప్రజలకు అనారోగ్య పరిస్థితి ఏర్పడితే ఒక్క పిలుపుతో చేరే ఆర్ఎంపి వ్యవస్థను బందు చేయాలని టీఎంసీ వాళ్లు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చట్టాన్ని సాకుగా చూపిస్తూ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేపిస్తున్న, ఆర్ఎంపీల పట్ల ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్రంలో ఇప్పటికి దాదాపు 260మంది పైగా ఆర్ఎంపీ లపై కేసులు నమోదు చేయించడం జరిగింది. ముఖ్యమంత్రికి ఆరోగ్య శాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి, పలువురు పలుమార్లు ఆర్ఎంపీలు వేడుకున్న ఉదాసీన వైఖరి సాగుతుందని నిస్పృహలో ఉన్నారు. రాష్ట్రమంతటా ఆర్ఎంపి పీఎంపీలు ప్రజలకు సేవలు అందించడం ఆపివేయాలని నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పటికే పెద్దపెల్లి జిల్లాలో పూర్తిస్థాయిలో వైద్యం అందించడం ఆపివేశారు. పెద్దపెల్లి జిల్లాలో ఐదు రోజుల నుండి ఆర్ఎంపీలు తమ సేవలను ఆపి వేశారు, పలు గ్రామాల్లోని ప్రజలు అసౌకర్యానికి గురి కావడంతో, రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయడం ప్రారంభించారు. రాష్ట్రమంతటా గ్రామాలలో ఆర్ఎంపీల సేవలు స్థంభించిపోతే, ప్రజా ఆరోగ్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలం కాక తప్పదు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . గ్రామాలలో ఎంబిబిఎస్ డాక్టర్లు 24 గంటలు చిన్న ఆరోగ్య సమస్యలకు అందుబాటులో ఉండి తక్కువ ఖర్చులో వారికి వైద్య సేవలు అందించడం అనేది ఎన్నటికీ జరగని పని. ఆర్ఎంపీ పీఏంపి ల పట్ల ప్రభుత్వ ఉదాసీనత ఈ విధంగానే కొనసాగితే, ప్రభుత్వం తీరు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకోక తప్పదు. ప్రభుత్వం, టిఎంసి కలిసి ప్రజలకు 24 గంటలు వారి ప్రతి ఆరోగ్య చిన్న సమస్యకు వెంటనే స్పందించి ఆరోగ్య సేవలు ఎలా అందించగలదో దానికి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారో, ప్రజల ఆరోగ్యం పట్ల వాళ్ల యొక్క చిత్తశుద్ధి ఏలా ఉంది అనేది రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే. ఈ టీఎంసి వ్యవస్థ ప్రజా ఆరోగ్యం నేరుగా అందించలేదు, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు, వైద్యుల కొరత, ఇప్పటికీ సరిగ్గా సేవలు సక్రమంగా అందించలేని ఈ ప్రభుత్వాలు, మండల కేంద్రాల్లో వారానికి రెండు రోజులు కూడా సరిగా ఉండని ప్రభుత్వ ఉద్యోగులైన డాక్టర్లతో గ్రామాల ప్రజలను పట్టణ పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఆర్ఎంపీలు అందించే విధంగా సేవలు ఎలా అందించగలరో అర్థం కాని విషయం, ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ పట్ల పట్టించుకోని ఈ ప్రభుత్వం, ప్రతి గ్రామంలో 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడిచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలు వేచి చూడాల్సిందే. (సయ్యద్ నిజాముద్దీన్ ఎడిటర్ SBN తెలుగు,హిందీ న్యూస్)
Comments