top of page
Search

Poorva Vidyarthula Aatmiya Sammelanam - Kothapalli Town


పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - కొత్తపల్లి పట్టణం

1990-91 విద్యా సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థిని విద్యార్థులు 34 సం, రాల తరువాత కొత్తపల్లి పట్టణంలోని ఓ స్థానిక ప్రవేటు ఫంక్షన్ హలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హాజరయినా అందరి సమక్షంలో జరుపుకున్నారు, ఈయొక్క కార్యక్రమంలో హాజరయినా పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు వారు చేస్తున్న ఉద్యోగలను, వ్యాపారాలను ఒకరోజు వదిలి వారి వయస్సును కూడా మరచి అందరూ తమ ఆట పాటలతో చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు,చాలా సం, రాలకు ఒకరినొకరు కలుసుకోవడంతో ఆనందాలను పంచు కున్నారు, కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు, మరణించిన కొందరి స్నేహితు లకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు, తదానంతరం హాజరయినా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి సన్మానం చేశారు, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ను చేసుకుంటామని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు, నిరుపేదలకు ఎంతోమందికి ఆర్ధిక సహాయం చేశామని ఇక ముందు కూడా వీలయితే చేస్తామని 1990-91 పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తెలిపారు.

 
 
 

Коментарі


bottom of page