top of page
Search

*Safety Awareness Rally on the Occasion of National Road Safety Month - Siddipet Traffic Police *


*జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా భద్రత అవగాహన ర్యాలీ - సిద్దిపేట ట్రాఫిక్ పోలిస్ *

సిద్దిపేట సిపి డా,బి అనురాధ ఆదేశంతో, ఏసీపీ మధు, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, ట్రాఫిక్ మరియు సిద్దిపేట వన్ టౌన్ సిబ్బందితో కలిసి సిద్దిపేట పట్టణం ఓల్డ్ బస్టాండ్ నుండి ముస్తాబాద్ చౌరస్తా, విక్టర్ టాకీస్ చౌరస్తా, గాంధీ రోడ్, సుభాష్ రోడ్, ఓల్డ్ బస్టాండ్ వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా వద్ద హెల్మెట్ గురించి అవగాహన నిర్వహించారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి గులాబీ పువ్వులు ఇచ్చి హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. https://youtube.com/shorts/_ODeK6d6OxE?si=7TLHligfmHztxZMT

ఈ సందర్భంగా సిద్దిపేట ఏసిపి మధు మాట్లాడుతూ, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కృంగదీస్తుందని తెలిపారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపినచో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి, ట్రాఫిక్ ఏఎస్ఐలు ఉమేష్, రఘు, సదాశివరావు, ట్రాఫిక్ సిబ్బంది, సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సిద్దిపేట పట్టణ యువకులు తదితరులు పాల్గొన్నారు.

 
 
 

Comments


bottom of page