Siddipet Congress Leaders Pay Tribute To Manmohan Singh
- sbnnews24tv7
- Dec 27, 2024
- 1 min read
మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులు అర్పించిన సిద్దిపేట కాంగ్రెస్ నేతలు

మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల నెడు సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి ఆదేశాల మేరకు క్యాంప్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి.వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. భౌతికంగా వారు దూరం అయినా, మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సంస్కరణలు మరియు చట్టాల రూపంలో భారతదేశ అభివృద్ధిలో సజీవంగా ఉంటారు అని అన్నారు.
నాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా గొప్ప ప్రణాళికలను రచించి, వాటిని అమలుచేసి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించారు. 2004 నుండి 2014 వరకు భారత ప్రధానమంత్రిగా ప్రపంచ వేదిక పై భారతదేశాన్ని ఒక మహోన్నత శక్తిగా నిలబెట్టారు అని అన్నారు.
కేవలం భారతదేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకున్న గొప్ప మేధావిగా ఖ్యాతి గడించిన మహానేత అన్నారు. ఒక రాజనీతిజ్ఞుడు, పండితుడు, మౌన ముని, మేధావి, ఆర్థికవేత్త, దూరదృష్టి గల నాయకుడు, దేశం గర్వించదగ్గ ఒక గొప్ప వారసుడిని కోల్పోయాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి గంప మహేందర్.రాష్ట్ర యుత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దం లక్మి.రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి కలిమోదిన్. డి సి సి అధికార ప్రతినిధి బుచ్చి రెడ్డి. డిసిసి ఉపాధ్యక్షులు పాండు. మార్క సతీష్. డి సి సి రేణుక. అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాహబ్. దశ అంజయ్య. మండల అధ్యక్షులు. బిక్సపతి. అంజి రెడ్డి. మల్లారెడ్డి. సర్పంచ్ సదాశివ రెడ్డి. షోబొద్దిన్. మార్క పద్మ. వహీద్ ఖాన్.జనార్దన్. మహిపల్ రెడ్డి. మహేందర్ మెరుగు రాజు రాజ్ రెడ్డి. అజ్మత్. అక్బర్. చెంది శ్రీను. వనజ. సంతోషి. స్రవంతి. కవిత. పద్మ. స్నేహ. తదితరులు పాల్గొన్నారు.
Comments