Siddipet Traffic ACP Suman Kumar, Provided Awareness To Auto Drivers About Traffic Rules, Road Regulations And Good Conduct
- sbnnews24tv7
- Dec 31, 2024
- 1 min read
*ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు ,సత్ప్రవర్తన అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్*

*సిద్దిపేట పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు, సత్ప్రవర్తన అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్* ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటోలను ఎక్కడ పడితే అక్కడ పార్కు చేయవద్దని సూచించారు. ప్రయాణికులకు మరియు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆటోలు నడుపుకోవాలని సూచించారు. ఆటోలు సీరియల్ వైస్ గా ప్రయాణికులను ఎక్కించుకొని పోయి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని తెలిపారు. అదే సమయంలో షాపు ఎదురుగా ఆటోలు పెట్టి షాపు యజమానులతో గొడవలు పడవద్దని తెలిపారు.
ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ లు తప్పకుండా తీసుకోవాలని సూచించారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయవద్దని తెలిపారు, డ్రైవర్ పక్కన కుడి ఎడమల ఎవరిని కూడా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకో వద్దని, మరియు పరిమితికి మించి ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని సూచించారు. ఆటోలో సౌండ్ బాక్సులు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. విధిగా యూనిఫామ్ ధరించి ఆటో నడపాలని తెలిపారు. నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఆటోకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్ వెంబడి ఉంచుకోవాలని సూచించారు. ఆటోలను పార్కు చేసేటప్పుడు పార్కింగ్ ప్రదేశాలలో పార్కు చేయాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయవద్దని సూచించారు. ఆటోల అడ్డా వద్ద, పార్కింగ్ ప్రదేశాలు మరియు ఆటోలో ఎక్కిన తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఆటో డ్రైవరు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. నిబంధన నిబంధనలు పాటించని వాహనదారుల పై మోటర్ వాహనాల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమం లో సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మరియు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,
Comments