కరీంనగర్లో విజయవంతమైన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి జిల్లా ఆత్మీయ సమావేశం.
సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు పలు నిర్ణయాలు తీసుకున్న DMJU
తేది 07-12-2024 - కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిజిటల్ మీడియా సమావేశం కరీంనగర్లోని RMP భవనంలో నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నాలుగు కొత్తజిల్లాల నుండి వివిధ డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరైయి డిజిటల్ మీడియా బలోపేతానికి పలు సూచనలు, సలహాలు చేశారు,అలాగే హాజరయిన రాష్ట్ర కమిటీ సమక్షంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తదనంతరం రాష్ట్ర మరియు జాతీయ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించి నట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరారు, అందుకు తగిన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు, ఇప్పుడు రాష్ట్రంలో, మరియు దేశంలో డిజిటల్ మీడియా ప్రభంజనం నడుస్తుందని, సామాన్య మానవులు ఎదురుకొంటున్న సమస్యలను ప్రభుత్వాలకు మరియు ప్రజలకు కళ్ళకు కట్టినట్లు ఎప్పటికప్పుడు చూపిస్తుందని, అందువలన ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో తమవంతు కర్తవ్యంగా ముందు ఉన్నది కాబట్టి ప్రజలు డిజిటల్ మీడియాను ఆధారిస్తున్నారని,కాబట్టి ప్రభుత్వాలు కూడా గుర్తించి డిజిటల్ మీడియాకు చట్టభద్దత కల్పించి అక్రీడేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ స్కీములు వర్తింప జేయాలనీ కోరారు, ఈయొక్క కార్యక్రమంలో డిజిటల్ మీడియా వ్యవస్థపాక అధ్యక్షులు ముతేష్, జాతీయ నాయకులు ఏనుగు మల్లారెడ్డి, చందా శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్, సహాయ కార్యదర్శి సునిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్, మంద వేణుగోపాల్,తదితరులు పాల్గొన్నారు.
Comments