TELANGANA AMBEDKAR SANGHAM NOOTANA KARYALAYAM PRARARAMBHAM
- sbnnews24tv7
- Sep 8, 2024
- 2 min read
తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కార్యాలయం ప్రారంభం.

కరీంనగర్ కిసాన్ నగర్ లో తెలంగాణ అంబేడ్కర్ సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి అమర్ నాథ్, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదనంతరం కిసాన్ నగర్ 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, మరియు 25 వ డివిజన్ కార్పొరేటర్ ఏడ్ల సరిత అశోక్, ఇరుగురాల ఆనందం రాష్ట్ర నాయకులు నూతన అంబేద్కర్ కార్యాలయాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ నియోజక వర్గ కన్వీనర్ జిల్లెల విజయ్ కుమార్, అంబేద్కర్ సంఘం డివిజన్ కిసాన్ నగర్ అధ్యక్షులు వడ్లూరి లక్ష్మణ్, మ్యాక లక్ష్మణ్, గంగాధర కుమారస్వామి, కాశి పాక అశోక్, దావు కనకయ్య, దొంతు ఎల్లయ్య, తిరుమల రత్నాకర్, దాసర అజయ్, ఆసంపల్లి బాలు, మేకల వెంకటేష్, వాటు మధునయ్య, గాలి రామచందర్, బెజ్జంకి ప్రవీణ్ కుమార్, జింక మల్లేశం,అంకమల్ల రవి మరియు అంబేద్కర్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అమర్ నాథ్ మాట్లాడుతూ దళితులపైన జరుగుతున్న దాడులను అరికట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయితుంది దళితులపైన జరిగే దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి, సమస్యలపైన ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకుండా సం, రాల తరబడి వాటిని పెండింగ్లోనే ఉంచుతూ, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై దొంగ ప్రేమ చూపిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తు దళితులను మోసం చేస్తూ వస్తున్నాయి. నగునూర్ గ్రామంలోని 669 సర్వే నెంబర్ 26 ఎకరాల ఎనిమిది గంటల ప్రభుత్వ బంచరాయి భూమి, కొత్తపల్లి గ్రామ రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 272 లో 25 ఎకరాల 4 గుంటలు ప్రభుత్వ బంచరాయి భూమి, చింతకుంట గ్రామ రెవెన్యూ శివారులో సర్వే నెం 142 ప్రభుత్వ శిఖం భూమిని దళితులకు పంచ కుండా రాజకీయ నాయకులు అందదండలతోని అగ్రవర్ణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జా దారులు ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.భూమి కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్న పేదలు దళితులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి దరఖాస్తులు నేటికీ కూడా ప్రభుత్వ ఆఫీసులో నుండి ఒక అడుగు కూడా ముందుకు పోవడం లేదు. కానీ ఎస్సీ మాదిగ కులానికి చెందిన నిరుపేద గడప కాంతమ్మ మరియు ఎస్సీ మాదిగ కులానికి చెందిన కోలపురి కొండయ్య భూమిని ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వ అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కై రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వం అధికారులు కళ్ళు తెరిచి భూ కబ్జాదారుల పైన తగు చర్యలు తీసుకొని నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు భూములను కేటాయించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపెళ్లి అమర్నాథ్ డిమాండ్ చేసినారు.
Comments