*Thanks To The State Government For Starting Activities For The Development Minorities.*
- sbnnews24tv7
- Oct 4, 2024
- 1 min read
*మైనారిటీల అభివృద్ధికై కార్యాచరణ ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.*

*మైనారిటీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై స్పందించిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా మైనారిటీల పక్షాన ధన్యవాదాలు*
*ఇటీవల హైదరాబాద్ సచివాలయం వేదికగా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కరీంనగర్ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్. ఏ. మోసీన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్. ఏ. మూసిన్ మాట్లాడుతూ, ఈ నెల, అక్టోబర్ 1న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని సచివాలయంలో ముస్లిం ప్రముఖులు కరీంనగర్ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్.ఏ. మోసీన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మజర్ మొహియుద్దీన్, అబూబకర్ ఖాలీ, ఫసియుద్దిన్ నవాబ్, తదితర నేతలు మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం మైనారిటీల సర్వతో ముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్వహించిన సమావేశం లో జిల్లాలోని మైనారిటీ సమస్యలపై స్పందించడంతో పాటు ఇతర జిల్లాల నుంచి రాజధాని నగరానికి వచ్చి పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ముస్లిం విద్యార్థు లకు ఆధునిక వసతులతో హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాల లను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి నగరంలో మైనారిటీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఒక బోర్డు కు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ భవన నిర్మాణం, ఆక్రమణకు గురైన ఖాజీపూర్ లోని 55 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములపై విచారణ చేపట్టి తిరిగిఆ భూములను వక్ఫ్ బోర్డ్ కు అప్పగించి పర్యవేక్షించడం తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చిన ఇచ్చినందుకు కరీంనగర్ జిల్లా ముస్లిం మైనారిటీల పక్షాన, మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు హాజీ భాయ్, నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు హైమద్, కరీంనగర్ రూరల్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షుడు శబాజ్ ఖాన్, బొమ్మకల్ ఎంపీటీసీ పాషా, తదితరులు పాల్గొన్నారు.
Comments