UntitleSavitribai Phule, The Country's First Teacher, Was Responsible For The Advancement Of Women - Minister Ponnam Prabhakard
- sbnnews24tv7
- Jan 3
- 1 min read
మహిళల ఎదుగుదలకు కారణమైన దేశ మొదటి ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే - మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండల కేంద్రంలో భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయ్ పులే 194 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటాని కి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, సావిత్రి భాయ్ పులే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రి భాయ్ పులే కి ఘన నివాళులు అర్పిస్తూన్న, వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది, వారి పట్ల అపారమైన గౌరవం ఉంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం తో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్రాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు,
సావిత్రి భాయ్ పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీ పడే విధంగా ఎదగాలని మంత్రి కోరుకున్నారు, భవిష్యత్ లో అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది అని, తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. మహిళలు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ,ఇందిరమ్మ ఇళ్లు ,మహిళా సంఘాల పటిష్ఠం ,కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వం లక్ష్యం, విద్య వ్యవస్థలో అనేక రకాల వసతులు కల్పిస్తుంది, ఆనాడు చదువుకోవడానికి నిషేధం ఉన్న ఆనాడు సావిత్రిబాయి పూలే మహిళల పక్షాన చదువులలో సమాజంలో వెలుగులు నింపిన సావిత్రి భాయ్ పులే కు ఘన నివాళులు అర్పిస్తున్న అని మంత్రి అన్నారు.